మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపాుర. ‘పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. తెలుగు సినిమాకు ఎనలేని కృషి చేశారు. ఈ గుర్తింపు మీతో పాటు తెలుగువారి గర్వాన్ని కూడా పెంచింది’ అని ట్వీట్ చేశారు.