నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన బాల్యం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆర్మీ కుటుంబంలో పుట్టడం వల్ల తాను ఎన్నో విలువలు నేర్చుకున్నానని తెలిపింది. ఆ విలువల వల్లే కెరీర్ పరంగా తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.