SKLM: బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో బుధవారం గౌరీ పున్నమి ఉత్సవాలు సందర్భంగా శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు జి.సునీల్ పర్యవేక్షణలో మహిళలు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు,పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.