SKLM: రేగిడి ఆమదాలవలస మండలం దేవుదలలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బాలల చట్టాలపై ఎస్సై లీలావతి బుధవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అదే విధంగా ఒత్తిడికి గురి కాకుండా చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు.