BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు అశ్వారావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ వట్టి వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు, లబ్ధిదారులు గమనించాలని కోరారు.