NGKL: శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని లింగాల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగరాజు అన్నారు. మహబూబ్ నగర్లో పనిచేస్తున్న నాగరాజు బదిలీపై లింగాల రాగా, ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న జగన్ వనపర్తి జిల్లా వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పలువురు నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.