AP: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగర్ వద్ద బస్సు, కారు ఢీ కొట్టుకోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.