దీపావళి ప్రతి ఏడు ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలనే సందేహాలు వస్తున్నాయి. కొందరు అక్టోబర్31న జరుపుకోవాలి అంటుంటే మరి కొందరు నవంబర్1న జరుపుకోవాలి అంటున్నారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈ నెల 31న మ.3:52 గం.లకు అమావాస్య మొదలయ్యి నవంబర్1 సా.6:16 గం.లకు ముగుస్తుంది. కాగా ప్రభుత్వం కూడా 31తేదీన సెలవు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో దృక్ పంచాంగం ప్రకారం నవంబర్ 1న జరుపుకోనున్నారు.