NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ కందుకూరు నియోజకవర్గ ఇంఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ రేపు ఉలవపాడు మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇటీవల మరణించిన బద్దిపూడి పంచాయతీ సర్పంచ్ అనిల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు గుడ్లూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామంలో పర్యటిస్తారు.