TG: దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి రాష్ట్రానికి రాగానే అపోజిషన్‌కు బ్రేకింగ్ న్యూస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్, ఫోన్ ట్యాపింగ్ సహా మరిన్ని బాంబులు సిద్ధమని ప్రకటించారు. ప్రధాన నాయకులకు ఇది తప్పకుండా బిగ్ షాక్ అవుతుందని చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్‌ను పెంచాయి. ఆధారాలతో అందరినీ బయటకు లాగుతామని అనడం రాష్ట్రంలో సచలనం రేపుతోంది.