టీ20 వర్ధమాన జట్ల ఆసియా కప్లో భారత్ ఎకు వరుసగా మూడో విజయం లభించింది. ఒమన్ ఎపై 6 వికెట్ల తేడాతో భారత్ ఎ గెలిచింది. తొలుత ఒమన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆయుష్ బదోని (51) అర్ధ శతకంతో మెరవగా.. అభిషేక్ (34), తిలక్ వర్మ (36*) రాణించారు.