TG: జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ జంజం హోటల్ వద్ద మద్యం లోడుతో ఆగి ఉన్న కంటైనర్‌ను మరో లారీ ఢీకొట్టింది. కంటైనర్‌లో ఉన్న లిక్కర్ బాటిల్లు చెల్లాచెదురు అవ్వగా లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం బాటిల్లు రోడ్డుమీద పడిపోవడంతో స్థానికులు ఎగబడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని జనాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. కంటైనర్‌ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించే పనులు చేపట్టారు.