AP: సీఎంగా పని చేసిన వ్యక్తి శవాల చుట్టూ రాజకీయం చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదని మాజీ సీఎం జగన్ను హెచ్చరించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు హాస్యాస్పదమన్నారు. మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. హోంమంత్రి స్వయంగా బాధితుల వద్దకు వెళుతున్నారని తెలిపారు.