ELR: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటల నుంచి జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి కామవరపుకోట వరకు నిరసన చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు.