‘దానా’ తుపాను ప్రభావంతో ద.మ. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. నేటినుంచి ఈనెల 29వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకల సమాచారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ముఖ్య నగరాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 200 రైళ్లను రద్దు చేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు సమాచారం.