ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి బదిలీ అయిన ఉపాధ్యాయులకు బుధవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే దక్కుతుందని మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ ఉదయ్ రావు పేర్కొన్నారు. హెచ్ఎం వెంకట్ తదితరులున్నారు.