సాధారణంగా తిన్న తర్వాతనో, నిద్ర వస్తున్నప్పుడో ఆవలింతలు రావడం సహజం. కానీ, తరచూ ఆవలింతలు వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన అలసట, మానసిక, స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉంటే ఆవలింతలు ఎక్కువ వస్తాయి. రక్తంలో గ్లూకోస్ లెవెల్ పడిపోయే సమయంలో కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఆవలింతలు ఆగకుండా వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.