AP: సీఎం చంద్రబాబును ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కలిశారు. ప్రతిపాదిత వక్ఫ్ యాక్ట్ సవరణపై అభ్యంతరాలు వివరించారు. కేంద్ర ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యమవుతుందని తెలిపారు. ముస్లింల హక్కులు, మనోభావాలు దెబ్బతింటాయని, వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని కోరారు. పార్లమెంట్లో చట్టాన్ని వ్యతిరేకించాలని సీఎంకు వినతిపత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముస్లింలకు సీఎం హామీ ఇచ్చారు.