NLR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగర పాలక సంస్థ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను కమిషనర్ సూర్యతేజ బుధవారం పర్యవేక్షించారు. స్థానిక ముత్తుకూరు రోడ్డు కూడలి ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన భారీ యంత్రాలతో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అన్ని డివిజనుల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కమిషనర్ సూచించారు.