AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతిచెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.