AP: రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, ఉచిత గ్యాస్ సిలిండర్‌తోపాటు ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు ఆమోదం తెలిపింది. వాటితోపాటు శారదపీఠం భూకేటాయింపుల రద్దుకు మంత్రివర్గం ఆమోదించింది.