బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలంటూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సికందర్’ టీమ్‌తోపాటు నటి రష్మికకు, మిగతా స్టార్ నటీనటులకు అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.