TG: మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. KTRతోపాటు తన PA తిరుపతి, సోషల్ మీడియా విభాగం, BRS నేత క్రిషాంక్‌పై కూడా అడిషినల్ DGP మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద బ్యూటిఫికేషన్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ నిర్మిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను అవమానిస్తోందని దళితులను రెచ్చగొట్టేలా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.