ELR: ద్వారకాతిరుమల, భీమడోలు మండల సరిహద్దుల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. బుధవారం భీమడోలు జంక్షన్ శివారు అందనాలమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చిరుత పాదముద్రలు గుర్తించడంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సమీపంలో రెండు బోనులు, ఒక మచాన్, లైవ్ కెమెరా, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.