ఢిల్లీ వేదికగా జర్మనీతో జరిగిన హాకీ తొలి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో పదేళ్ల తర్వాత జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. జర్మనీ ఆటగాళ్లు హెన్రిక్ మెర్జెన్స్, లుకాస్ విండ్ ఫెడర్ చెరో గోల్ సాధించి జట్టును గెలిపించారు. దీంతో రెండు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో జర్మనీ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఈ జట్ల మధ్య రెండో మ్యాచ్ రేపు జరగనున్నది.