IPL మెగా వేలంలోకి DC కెప్టెన్ రిషబ్ పంత్ రానున్నట్లు మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ విషయంలో మార్పు చేయాలని DC ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు..అందుకు పంత్ నిరాకరించడంతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంత్ వేలంలోకి వస్తే RCB తీసుకోవాలని భావిస్తుంది. కెప్టెన్సీ, వికెట్ కీపర్ స్థానంలో అతడిని భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై త్వరలో స్పష్టత రానుంది.