KMM: ఈనెల 25న జిల్లా పర్యటనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్న నేపథ్యాన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ.. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు గురువారం మధ్యాహ్నంలోగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.