TG: నల్లగొండలోని 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. వారిపై సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోం మంత్రి లేడు, రేవంత్ వద్దనే హోం శాఖ ఉంది. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.