ATP: పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఇటుకలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమంత్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా ఎస్పీ జగదీష్, రూరల్ డీఎస్పీ వెంకటేష్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన దాతలను అభినందించారు.