KMR: రాజంపేట మండల కేంద్రంలో ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ISRD) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ అధ్యక్షురాలు రవళి మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో మానవ అక్రమ రవాణ, సామాజిక మాద్యమాల వల్ల ఎదురవుతున్న సమస్యలు, మాదక ద్రవ్యాల వినియోగం,సైబర్ నేరాలు (మోసాలు) అంశాలపై మహిళలతో చర్చించారు.