ASR: ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.శాంతకుమారి ఆరోపించారు. బుధవారం అరకులో పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు జీవో నెంబర్-3ని పునరుద్ధరిస్తామని, చట్టబద్ధత కల్పిస్తామని ఎన్డీయే కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.