ADB: ఉట్నూర్ మండల అభివృద్ధికి సహకరించాలని ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్‌ను ఆ మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. బుధవారం సాయంత్రం వారు ఆదిలాబాద్ పట్టణంలో ఎంపీని కలిసి పలు సమస్యలను ఆయనకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జగ్జీవన్, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, మాజీ సర్పంచ్ హరి నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.