TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు సూర్యాపేటలో గవర్నర్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై వారిరువురు చర్చించారు. కాగా, రేపు సూర్యాపేటలోని జిల్లా అధికారులు, కవులు, కళాకారులతో జరిగే పరిచయ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు.