NZB: ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై జరిమానాలు విధించారు. హోటల్ నిర్వాహకులు వినియోగదారులకు తాజా ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ ఉన్నారు.