TG: అంబుజా సిమెంట్ పరిశ్రమ వల్ల ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జనజీవనానికి ఇబ్బందులు కలుగుతుండటంతోనే ఆ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కడుతున్నప్పుడు కోదండరామ్ వ్యతిరేకించారు కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని కోదండరామ్ ఎందుకు వ్యతిరేకించట్లేదని ప్రశ్నించారు.