మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో ప్రాధాన్యత కల్పించింది. కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నుంచి అజిత్ పవార్ పోటీ చేయనున్నారు. కాగా, నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.