ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని పెద్దఉల్లగల్లు గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి ఫారుక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. వరి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు 20 నుంచి 25 కేజీల పొటాష్‌తో పాటు 30 కేజీల యూరియాను కలిపి చల్లాలని సూచించారు. రైతులు యాజమాన్య పద్ధతిని పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.