ASR: పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు కంటి కలకలు, గజ్జితో బాధపడుతున్నారని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మనోజ్ఞ బుధవారం తెలిపారు. కండ్ల కలకలు, గజ్జి సోకిన పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి రావాలని సూచించారు. మందులు వాడి, తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.