అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్పై క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ విడుదల కోసం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను అల్లు అరవింద్ పరిశీలిస్తున్నారట. జనవరిలో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువ ఉందట. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.