TG: జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. గంగారెడ్డి హత్యను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఎవరున్నా.. వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.