మన్యం: జియమ్మవలస మండలంలోని చిన మేరంగి సమీపంలో సారా బట్టీలపై స్థానిక పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. తమకి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు గ్రామ శివార్లలో సోదాలు చేపట్టాగా సారా తయారీకి నిల్వ ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊట, మరో 20 లీటర్ల నాటు సారాను గుర్తించి ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.