AKP: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాతో ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు జి సీతారాం జిల్లా పోలీస్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యుడు సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. బాలలపై జరిగే అకృత్యాలను నివారించేందుకు పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.