రణబీర్‌కపూర్ రాముడి పాత్రలో, అగ్ర కథానాయిక సాయిపల్లవి సీతగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి రామాయణం వింటూ పెరిగానని, సీతమ్మ పాత్రలో నటించే ఛాన్స్ రావడం అదృష్టమన్నారు. తన కెరీర్లో ఇదొక అపురూపమైన చిత్రంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.