మన గోళ్లకు అందాన్ని తీసుకువచ్చే నెయిల్ పాలిష్ వెనక మనకు కంటికి కనిపించని ఆరోగ్య ప్రమాదం పొంచి ఉందా..? అంటే అనువనే సమాధానమే వినపడుతోంది. దీని కథేంటో ఇప్పుడు చూద్దాం.
అందాన్ని కోరుకోని అమ్మాయిలు ఎవరూ ఉండరు కదా. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అందంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల వెంట్రుక దగ్గర నుంచి కాలి వేలి వరకు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నెయిల్ పాలిష్ ఈ అందంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి. మహిళలు తమకు నచ్చిన వాటిని ఎంచుకుని వాడుతారు. కానీ, ఈ నెయిల్ పాలిష్ మీ ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలుసా?
నెయిల్ పాలిష్ వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
నెయిల్ కలర్ పాడవడం:నెయిల్ పాలిష్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల మీ నెయిల్ కలర్ పాడవుతుంది. చర్మ క్యాన్సర్ ప్రమాదం:జెల్ నెయిల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి ఉపయోగించే UV లైట్లు చర్మ క్యాన్సర్, అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతాయి. గోళ్లు గరుకుగా మారడం: రసాయనాలతో నెయిల్ పాలిష్‌ను తొలగించడం వల్ల మీ గోళ్ళు గరుకుగా మారుతాయి. అలాగే, మీ గోళ్ల సహజ రంగు కూడా వాడిపోవచ్చు. గోరు ఇన్ఫెక్షన్లు:గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఆరోగ్య సమస్యలు: నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు మీ గోళ్లలోకి ప్రవేశించి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
నెయిల్ పాలిష్ హానికరమైన ప్రభావాలను ఎలా నివారించాలి
నెయిల్ పాలిష్‌ను తక్కువ సేపు ఉంచండి: రెండు వారాల కంటే ఎక్కువసేపు నెయిల్ పాలిష్ ఉంచవద్దు. జెల్ లేదా పౌడర్ డిప్ పాలిష్‌ను మీరే తొలగించవద్దు:ఇది మీ గోళ్లకు హాని కలిగిస్తుంది. దాన్ని తీసివేయడానికి మానిక్యూరిస్ట్తో అపాయింట్మెంట్ తీసుకోండి. LED క్యూరింగ్ లైట్లను ఉపయోగించండి:UV లైట్లకు బదులుగా LED క్యూరింగ్ లైట్లను ఉపయోగించే సెలూన్‌కి వెళ్లండి. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నెయిల్ పాలిష్ వేయండి:మీ గోర్లు తమను తాము రిపేర్ చేసుకోవడానికి సమయం ఇవ్వండి. తక్కువ రసాయనాలు కలిగిన బ్రాండ్లను ఎంచుకోండి:ఫార్మాల్డిహైడ్ లేని నెయిల్ పాలిష్‌లను వాడండి.