Side Effects Of Nail Polish : చాలా మంది అమ్మాయిలు నెయిల్ పాలిష్‌లను ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. డ్రస్ రంగుకు తగ్గట్టు మ్యాచింగ్ పాలిష్‌లను మెయింటెన్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువగా ఈ గోళ్ల రంగుల్ని వేసుకునే వారు వాటి వల్ల దుష్పరిణామాలను సైతం ఎదుర్కోవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా జెల్ నెయిల్ పాలిష్‌లు(gel Nail Polish ) వేసుకునే వారికి చర్మ క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది.
జెల్ పాలిష్ వేసుకున్న నెయిల్స్‌పై ఎండ పడితే అవి యూవీ రేస్‌గా మారతాయిట. దీంతో చర్మ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. దీనితోపాటు యూవీ రేస్ తరచుగా తాకుతూ ఉండటం వల్ల చర్మం ముడతలు పడుతుంది. తద్వారా ముందస్తు వృద్ధాప్యం వచ్చే ప్రమాదమూ పెరుగుతుందట.
అలాగే అతిగా గోళ్ల రంగును(Nail Polish )వాడే వారిలో గోళ్లు కాంతి విహీనంగా తయారవుతాయి. ఎందుకంటే గోళ్ల రంగును తయారు చేసేప్పుడు వాటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలను వాడతారు. వాటి ప్రభావం వల్ల గోళ్లు సహజసిద్ధమైన మెరుపును కోల్పోతాయి. అలాగే గోళ్లలో పగుళ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్లు కూడా రావొచ్చు. గోళ్ల రంగు, దాన్ని తొలగించడానికి వాడే రిమూవర్ రెండింటిలోనూ ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అందువల్ల గోళ్లు తరచుగా విరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి సాథ్యమైనంత వరకు దాన్ని వేసుకోకుండా ఉండేందుకే ప్రయత్నించాలి.