»India Through To The Semis After Rain Halts Irelands Charge
Team India : సెమిస్ కి చేరుకున్న టీమిండియా మహిళల జట్టు..!
Team India : టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.
టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది. టీమ్ఇండియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.
ఐర్లాండ్ గెలుపు కోసం ఆ సమయానికి చేయాల్సిన స్కోరు 59. దీంతో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు సాధించారు. స్మృతి మంధాన అర్థ శతకం(87)తో చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. చివర్లలో జెమీమా రోడ్రిగ్స్ (19) మెరుపులు మెరిపించింది.
షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13 పరుగులు చేశారు. ఆట చివర్లో జెమీమా 12 బంతుల్లో 19 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాబీ లూయిస్, కెప్టెన్ లారా డెలానీ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించి ఐర్లాండ్ ను గెలుపుదిశగా నడిపించారు. విజయం వైపు తీసుకెళ్తున్న సమయంలో వర్షం కురవడం ఇండియాకు కలిసొచ్చింది. 5పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.