ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటి వరకు మనం ఫోన్ లో వాట్సాప్ ఉపయోగించాం. ఫోన్ సహాయంతో… డెస్క్ టాప్ వాట్సాప్ ఉపయోగించి ఉంటాం. కానీ.. ఒకే ఫోన్ నెంబర్ తో.. రెండు ఫోన్ లలో వాట్సాప్ ని ఉపయోగించుకునే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ల బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. రాబోయే నెలల్లో వాట్సాప్ ఫీచర్ అందరికీ అందుబాటులో రావచ్చు. వాట్సాప్ యూజర్లందరూ ప్రస్తుత అకౌంట్ ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది.
యూజర్లు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వంటి నాలుగు ఇతర డివైజ్‌లకు లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు రెండు ఫోన్లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇకపై రెండు మొబైల్ ఫోన్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. రెండు మొబైల్ నెంబర్లకు ఒకటే వాట్సాప్ నెంబర్ వినియోగించుకోవచ్చు. నిర్దిష్ట అకౌంట్‌కు ప్రస్తుతం ఎన్ని డివైజ్ లాగిన్ అయ్యాయో చెక్ చేసుకోవచ్చు.