పాకిస్థాన్ లోని పెషావర్ లో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న మసీదులో పార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు లోపలికి వచ్చి తనకు తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాంబు ధాటికి చాలామందికి గాయలయ్యాయి. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు కానీ.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Pakistan | At least 50 people were injured when a “suicide attacker” blew himself up in a mosque located in Peshawar's Police Lines area during prayers: Geo News