బాల్యంలో తనకు చదువుంటే బోర్ కొట్టేదని మైక్రోసాష్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదేళ్ల (Satya Nadella)తెలిపారు. క్రికెట్ ఆట వైపే మనసు లాగేదని ఆయన అన్నారు. లింక్డ్ ఇన్ సీఈఓ రయాన్ రోలన్సీకి (Ryan Rolanci) తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో నాదేళ్ల తన చిన్నతన్ని గుర్తచేసుకొని జ్ఞాపకాలను (Memories) నెమరవేసుకున్నారు. చదువుల్లో ముందు ఉండే వాడిని కాదని ఆయన తెలిపారు.
బాల్యంలో తనకు చదువుంటే బోర్ కొట్టేదని మైక్రోసాష్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదేళ్ల (Satya Nadella)తెలిపారు. క్రికెట్ ఆట వైపే మనసు లాగేదని ఆయన అన్నారు. లింక్డ్ ఇన్ సీఈఓ రయాన్ రోలన్సీకి (Ryan Rolanci) తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో నాదేళ్ల తన చిన్నతన్ని గుర్తచేసుకొని జ్ఞాపకాలను (Memories) నెమరవేసుకున్నారు. చదువుల్లో ముందు ఉండే వాడిని కాదని ఆయన తెలిపారు. అయితే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌తో (Computer software) అనేక పనులు సులువుగా చేయగలిగే అవకాశం ఉండటం తనను ఆ రంగంవైపు ఆకర్షించిందని తెలిపారు. చిన్నతనంలో (child hood) తన దృష్టి చదువుపైకంటే..క్రికెట్‌పైనే ఎక్కువగా ఉండేదని వెల్లడించారు.
ఇక వృత్తిజీవితంలో తన విజయాలకు తల్లిదండ్రులే కారణమని సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. తన అభిరుచికి తగిన అవకాశాలను వెతుక్కునే ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను వారు తనకు ఇచ్చారన్నారు. ‘‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా తల్లిదండ్రులే ప్రధాన కారణమన్నారు. సత్య నాదెళ్ల 1967లో జన్మించారు. తండ్రి ఐఏఎస్ అధికారి(IAS OFFICER) ఆర్థికవేత్త. తల్లి సంస్కృతంలో ప్రొఫెసర్ (Profcer). తన తల్లిదండ్రులిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండేది కాదని సత్య నాదెళ్ల గుర్తు చేసుకున్నారు. కానీ, తనకు స్వేచ్ఛ ను ఇచ్చే విషయంలో మాత్రం వారు ఏకాభిప్రాయమే వ్యక్తం చేసేవారని తెలిపారు. తన స్కూలింగ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) ల గడిచిందన్నారు. కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల విజన్ ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. 2019 నుంచీ ఈ చాట్‌బాట్ అభివృధ్దికి మైక్రోసాఫ్ట్ తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ( chatgpt)సాయంతో మైక్రోసాఫ్ట్.. సెర్చ్ ఇంజన్ రంగంలో గూగుల్‌కు (Google) సరికొత్త సవాలు విసిరింది.