నేపాల్ (Nepal) అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ (Ramachandra Poudel) విజయం సాధించారు. 214 మంది ఎంపీలు, 352 మంది శాసనసభ సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ (Congress) పార్టీ నేత. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు.
నేపాల్ (Nepal) అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ (Ramachandra Poudel) విజయం సాధించారు. 214 మంది ఎంపీలు, 352 మంది శాసనసభ సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ (Congress) పార్టీ నేత. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 27న ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), పుష్పకమల్ దహాల్(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్), మరో ఐదు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నేపాల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు రామచంద్ర పౌడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఓట్లు 882. వారిలో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 550 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు. నేపాల్ ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శాలిగ్రామ్ (Saligram)మాట్లాడుతూ… 518 మంది అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంటు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. 2008లో నేపాల్ రిపబ్లిక్ గా అవతరించాక, దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్డెన్ (Rajendra Prasad Lyngden) ఉపప్రధానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి.